![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -315 లో.. రాజ్ వేరేక అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నాడని కావ్య బాధపడుతూ భోజనం చెయ్యకుండా వచ్చి పడుకుంటుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఏమైంది ఎందుకు అలా ఉంటున్నావ్? తిన్నావా అని అడుగుతాడు. కడుపు నిండా దుఃఖం ఉంది. భోజనానికి ఖాళీ లేదని కావ్య బాధపడుతు రాజ్ తో అనగానే.. నువ్వు ఇలా తినకుండా పడుకొని ఉంటే నాకెలా ఉంటుందని రాజ్ అంటాడు.
ఆ తర్వాత రాజ్ వెళ్లి కావ్యకి భోజనం తీసుకొని వచ్చి తినమని చెప్తాడు. నాకు వద్దని కావ్య అనగానే.. నీకెలా తినిపించాలో నాకు తెలుసంటూ కావ్య చేతులని తన చీరతోనే కట్టి భోజనం తినిపిస్తాడు. కావ్య మాత్రం రాజ్ ప్రేమగా తినిపిస్తుంది పట్టించుకోకుండా వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉన్న విషయాలే గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. ఆ తర్వాత రాజ్ కి శ్వేత ఫోన్ చెయ్యడంతో కంగారుగా నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుందని బయటకు వెళ్లి మాట్లాడతాడు. కావ్యకి రాజ్ ప్రవర్తన ఇంకా బాధేస్తుంది. కావ్య తన బాధ కృష్ణడితో చెప్పుకుంటుంది. అప్పుడే కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి.. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఏమైందని అడుగుతుంది. భార్యని భర్త దూరం పెడుతు వేరొక అమ్మాయిని ఇష్టం పడుతున్నాడని కావ్య అనగానే.. అంటే రాజ్ గురించి అంటున్నావా అని ఇందిరాదేవి అడుగుతుంది. లేదు నా స్నేహితురాలు నన్ను సలహా ఇవ్వమని అడిగింది. మీరైతే ఏం సలహా ఇస్తారని కావ్య అడుగుతుంది. నీ స్నేహితురాలిది అనుమానం అయి ఉండొచ్చు.. మన కళ్ళతో చూసినది కూడా కొన్నిసార్లు అబద్దమై ఉంటుంది. ముందు తన భర్తకి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకునే అంత ఇష్టం ఉందో? లేదో కనుక్కోమను అని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో నాకు సమాధానం దొరికిందని కావ్య అనుకుంటుంది.
మరుసటి రోజు ఉదయం.. మీ అన్నయ్య, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి. మనమే తప్పుగా అనుకుంటున్నామా అన్న విషయం కనుక్కోవాలని కళ్యాణ్ తో కావ్య చెప్తుంది. ముందు మనం అన్నయ్య ఫోన్ లో వాళ్ళ చాట్ లిస్ట్ చదవాలని కళ్యాణ్ అంటాడు. కానీ కావ్య వేరేవాళ్ళ ఫోన్ ముట్టుకోవడం పద్ధతి కాదని అనగానే.. కళ్యాణ్ వెళ్లి రాజ్ ఫోన్ తీసుకొని వస్తాడు. అందులో ఉన్నా చాటింగ్ చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో అపర్ణ ధటన్యలక్ష్మీలకి గొడవ మొదలవుతుంది. తనని నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది. తనకి కూడా గుర్తింపు ఉండాలి కదా అని అపర్ణతో ధాన్యలక్ష్మి అనగానే.. ఆ విషయం నాకు కాదు. నీ కొడుకు చెప్పని అపర్ణ అంటుంది. అధికారం అంత నీ కొడుకు చేతిలో ఉంటే నా కొడుకుకి ఏం చెప్పాలని ధాన్యలక్ష్మి అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |